శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (14:33 IST)

బొప్పాయితో చర్మ సౌందర్యం.. అల్పాహారంలో తీసుకుంటే?

చర్మానికి కావలసిన పోషకాలు బొప్పాయిలో వుంటాయి. బొప్పాయి పండును మెత్తగా పేస్టులా రుబ్బుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మం కోమలంగా తయారవుతుంది. బొప్పాయి గుజ్జు ముఖానికి రాసుకుంటే మంచి రంగు వస్తుంద

చర్మానికి కావలసిన పోషకాలు బొప్పాయిలో వుంటాయి. బొప్పాయి పండును మెత్తగా పేస్టులా రుబ్బుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మం కోమలంగా తయారవుతుంది. బొప్పాయి గుజ్జు ముఖానికి రాసుకుంటే మంచి రంగు వస్తుంది. చర్మానికి కావలసిన నీరు బొప్పాయిలో పుష్కలంగా వుంటుంది. ఈ నీరు చర్మాన్ని తేమగా వుంచుతుంది. 
 
బొప్పాయి పండును తరచూ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్-ఎ పుష్కలంగా వుంటుంది. చర్మంపై ఉన్న మృతకణాలను బొప్పాయి పోగొడుతాయి. పగిలిన పాదాలకు బొప్పాయి గుజ్జు రాస్తే పగుళ్లు మాయమవుతాయి. పాదాలు మృదువుగా తయారవుతాయి. 
 
అలాగే బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండును ఉదయం అల్పాహారంలో తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి పండు ముక్కలకు తేనె చేర్చి తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధిత జబ్బులు నయం చేస్తుందని, ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే రక్తపోటును నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.