మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

బుధవారం, 9 ఆగస్టు 2017 (22:22 IST)

pepper

ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు కూడా వుంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులు, మోకాళ్ల నొప్పికి మిరియాలు చెక్ పెడుతుంది. గొంతునొప్పి, ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. మిరియాల పొడి 50 గ్రాములు తీసుకుని అందులో 600 మి.లీటర్ల నీరు చేర్చి 30 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నీటిని వడగట్టి రోజూ మూడు పూటలూ 25 మి.లీ చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.  
 
జుట్టు రాలిపోతుంటే మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయలు మూడింటిని సరిపాళ్ళతో తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని జుట్టు పెరగని చోట రాస్తే జుట్టు పెరుగుతుంది. జ్వరం. జలుబుకు ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
మిరియాలు ఉదరంలోని వాతాన్ని తొలగించి శరీరానికి ఉష్ణాన్ని ఇవ్వడంతో పాటు వాపులను నయం చేస్తుంది. మిరియాల పొడిని ఉప్పుతో కలిపి బ్రష్ చేసుకుంటే పంటినొప్పి, పళ్ళు పుచ్చిపోవుట, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసను నిరోధించవచ్చు. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే తలభారం, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

స్మార్ట్‌ఫోన్లు మైకంలో యువత: డేటింగ్ లేదూ.. ఫ్రెండ్సూ లేరు.. గదిలోనే కూర్చుని ఒంటరివారైపోతున్నారు..

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం ...

news

రోజూ స్కిప్పింగ్ చేయండి.. బరువు తగ్గండి..

రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య ...

news

పండ్లను శుభ్రంగా కడిగి తినకపోతే..?

పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? ...

news

దానిమ్మకు అంతటి శక్తి వుందా...? శృంగార సామర్థ్యం పెంచుతుందట...

దానిమ్మ పండ్లను రోజుకొకటి తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ...