పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు....
పెసల్లో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా వుండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు వయసుకున్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. ఇందులో అధిక కాపర్ వల్ల చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది.

అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడే వాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. వీటిల్లో కాల్షియం ఎముక నిర్మాణానికి దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపి రోగులకీ ఇవి మంచిదే. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది.
ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటి లోపాలతో బాధపడే వాళ్లకీ ఇవి ఎంతోమేలు. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంతో పిల్లలకీ పెరుగుదలకీ తోడ్పడుతాయి.