1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:17 IST)

మినుములను నూనెలో వేయించి..?

మినుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మినపప్పు తరచు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు అనేకరకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చును. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతాయి. 
 
పావుకప్పు మినుములను నూనెలో వేయించుకోవాలి. ఆపై 5 ఎండుమిర్చి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి కచ్చాపచ్చాగా చేసి అందులో కొద్దిగా ఉప్పు, వేయించిన మినుములు వేసి రుబ్బుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ, టమోటాలు వేసి పచ్చడిగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. చివరగా ఈ పచ్చడిలో నెయ్యివేసి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచుగా ఉంటుంది. ఇలా మినుముతో చేసిన పదార్థాలు తింటుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
అంతేకాక గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు కారణం మినుముల్లో ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. అలానే మినుములతో తయారుచేసిన గారెలు, వడలు వంటివి తింటుంటే కూడా డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు వ్యాధిని తగ్గిస్తుంది.