శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:43 IST)

కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి..?

కొబ్బరికాయలను మనలో అధిక శాతం మంది దేవునికి నైవేద్యంగా వాడుతారు. కొబ్బరిబొండాల్లోని నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. దీంతోపాటు దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే పూర్తిగా పక్వానికి వచ్చిన కొబ్బరికాయ కొబ్బరి నుంచి తయారయ్యే కొబ్బరి పాలతోనూ మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి..
 
వెంట్రుకలు రాలిపోవడం:
కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటల పాటు ఉంచాలి. అనంతరం బయటికి తీసి దానిపైన ఏర్పడిన పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించి వేడి నీటిలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంటసేపు అలానే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా తయారవుతుంది.
 
బరువు తగ్గించే దివ్యౌషధం:  
కొద్ది మొత్తంలో కొబ్బరి పాలను తీసుకున్న కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతాయి. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కొబ్బరి పాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
 
ఎముకలకు దృఢత్వం:  
పాస్ఫరస్, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు దృఢత్వం లభిస్తుంది. కొబ్బరి పాలలో ఉండే గ్లూకోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది. ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులకు కొబ్బరి పాలు మంచి మందులా పనిచేస్తాయి. ఆర్థరైటిస్‌కు చక్కని మందుగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజుకో కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది.