శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జులై 2018 (13:29 IST)

ఈ చిట్కాలతో ఒత్తిడి మటుమాయం...

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్య సాధన.. ఇలా కారణమేమైనప్పటికీ ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలోనూ కామనైపోయింది. దీంతో అది డిప్రెషన్‌కు దారి

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్య సాధన.. ఇలా కారణమేమైనప్పటికీ ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలోనూ కామనైపోయింది. దీంతో అది డిప్రెషన్‌కు దారి తీసి చివరకు బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. అయితే అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఎవరైనా నిత్యం తమకు ఎదురయ్యే ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. అందుకు ఏం చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం వినోదం. జీవితంలో కేవలం ఇల్లు, ఆఫీసు, కాలేజీయే కాదు.. వినోదానికీ పెద్ద పీట వేయాలి. అందులో మునిగి తేలితే ఒత్తిడిని జయించినట్టే. 
* మెదడుకు పని చెప్పడం. అంటే పజిల్స్ నింపడం, పదవినోదం వంటివాటితో మెదడుకు పని చెప్పడం. అలాగే, వివిధ రకాల గేమ్స్ ఆడటం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. తద్వారా ఒత్తిడి మటుమాయమవుతుంది. 
* వ్యాయామంతో ఒత్తిడి చెక్. ఇందుకోసం ఈత కొట్టడం, ఇష్టమైన క్రీడలు ఆడడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయాలి. 
* మనసును స్థిరంగా ఉంచుకునేందుకు యోగా సాధనం చేయాలి. యోగా సాధన వల్ల కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చు.
 
* ఒత్తిడిని జయించాలంటే ఒంటరి తనానికి దూరంగా ఉండటం. నలుగురిలో కలసి తిరగాలి. కొత్త ప్రదేశాలను సందర్శించాలి. సరదాగా గడపాలి. వీలైనంత వరకు సమస్యలను మరిచిపోయేందుకు ప్రయత్నించాలి. 
* వీటితో పాటు.. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అంటే పాలు, బాదం పప్పు, నారింజ పండ్లు, పాలకూర, చేపలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటే ఒత్తిడి దరిచేరదు. వీటిల్లో ఉండే పోషకాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.