శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (11:46 IST)

పుచ్చకాయ, తేనెతో చర్మ సౌందర్యం మెరుగు

పుచ్చకాయలో విటమిన్ ఏ, బీ1, సీలు పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయ తింటే మయిశ్చరైజర్స్ వాడాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ముక్కకు

పుచ్చకాయలో విటమిన్ ఏ, బీ1, సీలు పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయ తింటే మయిశ్చరైజర్స్ వాడాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ముక్కకు తేనెను అద్ది ముఖంపై మృదువుగా మర్దన చేస్తే ఎండ వేడికి కమిలిన చర్మం కాంతివంతమవుతుంది. పుచ్చకాయ రసానికి పెరుగు కలిపి అప్లై చేస్తే చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. అంటే పుచ్చకాయ సహజ సిద్దమైన టోనర్‌గా పనిచేస్తుంది.
 
చర్మం జిడ్డుగా తయారై మొటిమలు ఎక్కువగా వుంటే.. పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మొటిమలు ఇట్టే మాయమవుతాయి. పుచ్చకాయలోని విటమిన్ ఎ చర్మంలోని జిడ్డును తగ్గిస్తే, అందులోని నీటి శాతం ముఖాన్ని మరింత కాంతివంతం చేసి చర్మాన్ని తాజాగా వుంచుతుంది. పుచ్చకాయ రసానికి శనగపిండి కలిపి స్క్రబ్‌గా ముఖానికి అప్లై చేయొచ్చు. దాంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.