బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (15:28 IST)

భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బా

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధలు నుంచి తప్పించుకోవచ్చు.
 
వర్షాకాలంలో ఎదురయ్యే ఈ శ్వాసకోశ సమస్యలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం యోగాసనాలు. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకరమని యోగాసన నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ ఆసనం వేయడం వల్ల వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడటమేకాక జీర్ణశక్తి పెరుగుతుంది.