శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2022 (23:11 IST)

యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Yoga
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడితో పాటు ఆర్థికపరమైన సమస్యలు తదితర ఇతర సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దైనందిన జీవితంలో ప్రతిరోజూ కనీసం ఓ అర్థగంటయినా యోగా చేయాలంటున్నారు నిపుణులు. యోగాతో కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయని చెపుతున్నారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

 
యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి యోగా సహాయపడుతుంది. యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. యోగా కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

 
యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వుండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది.