శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chj
Last Modified: శనివారం, 28 మే 2016 (18:30 IST)

నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది... ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే బాగుండుననీ...

నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది. అది అలాఅలా పెరిగింది. ఆ వ్యక్తిని గూర్చి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. కొన్నాళ్లు గడిచాయి. ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే ఎంత బావుణ్ణు అనే కోరిక కలిగింది. ఆ వ్యక్తిపై ఇతరులకు అభిమానమున్నట్లు తెలిస్తే చాలు ఒళ్లు మండేద

నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది. అది అలాఅలా పెరిగింది. ఆ వ్యక్తిని గూర్చి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. కొన్నాళ్లు గడిచాయి. ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే ఎంత బావుణ్ణు అనే కోరిక కలిగింది. ఆ వ్యక్తిపై ఇతరులకు అభిమానమున్నట్లు తెలిస్తే చాలు ఒళ్లు మండేది. వాళ్ల మీద ఎంతో ద్వేషం కలిగేది. నేనేదో పోగట్టుకుంటున్నాననిపించేది. ఆ క్రోధంలో వెనుకటి స్నేహాన్ని మరిచిపోయి ఎన్నో కానిమాటలు మాట్లాడాను. ఏం చేయాలో తెలియడంలేదు. అసలు ఇదంతా ఎలా సంభవించిందో అగమ్యగోచరంగా ఉంది. ఏమిటి కారణం...?
 
శ్రీకృష్ణుడు 'భగవద్గీత'లో దీనికి సమాధానం ఇలా ఇచ్చారు. లోకంలో మనం ఏ వ్యక్తులను గురించి లేక ఏ వస్తువులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, పరిచయం పెంచుకుంటామో, వారిపై మనకు సంగం కలుగుతుంది. సంగమంటే ఆసక్తి. ఆ ఆసక్తే బలపడితే కొన్ని కోరికలు పుడతాయి. అవి కొన్ని నెరవేరుతాయి. కొన్ని విఫలమవుతాయి. దాని వల్ల ఇతరులపై క్రోధం కలుగుతుంది. క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది.

ఆవేశపరుడైనవాడు తనను తాను మరిచిపోతాడు. మంచిచెడులు లేకుండా మాట్లాడి, చెడ్డ పనులు చేస్తాడు. ఇప్పుడు మీ సమస్య స్వరూపం మీకర్థమైందనుకుంటాను. మీరు ముందే జాగ్రత్తపడి ఉండే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు. వ్యక్తులతో కానీ వస్తువులతో యోగ్యాయోగ్య విచక్షణ లేకుండా మీరు పరిచయం కలిగించుకోకూడదు. అలా కలిగించుకుంటే మిగతావి కూడా తప్పవు. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవాలి. పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది.