భవానీ మాలధారణ విధానాలు

maladharana
ఎం|
శ్రీ భవానటక విధానాలు స్త్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించవచ్చును. దీక్ష తీసుకొను భక్తులు ప్రాతః కాలముననే స్నానమాచరించి ఎర్రటి లేదా (సింధూరం ) కాషాయం
రంగు వస్త్రములు ధరించి, చందనం, కుంకుమ బొట్టుగా ఎర్రని పూసల మాలను (దండ) తీసికొని ఆ గ్రామము నందలి ఏ అర్చకునిచే గాని, గురు భవానిచే గాని మాలధారణ చేయవలెను. మాలధారణ చేయునప్పుడు శ్రీ కనకదుర్గా స్త్రోత్రం పఠించవలెను.

మాలధారణ చేసిన భవానీలు అందరూ ప్రతిరోజు ఉదయం, సాయంకాలం చన్నిటి ఆచరించి శ్రీ అమ్మవారి 108 నామాలు పఠించి రెండుపూటలా దీపారాధన చెయ్యాలి. శ్రీ కనకదుర్గాదేవి భవానీ దీక్షని స్త్రీ, పురుష భేదం లేదు.

శ్రీ భవానీ దీక్ష తీసుకొను భక్తులు ప్రాతః (సింధూరం ) కాషాయరంగు వస్త్రములు ధరించవలెను. 108 ఎర్రని పూసల మాల దేవి ఆలయంలో అర్చకునిచే గురి చేసుకొనవలెను. దీక్షాపరులు దీక్ష ముగియు వరకు ప్రతిరోజు ఒంటిపూట భోజనము చేసి నేలపై పడుకొనుచూ, బ్రహ్మచర్యము పాటించవలెను.


మైలపడినవారిని తాకినచో లేదా మృతి చెందిన వారిని చూచిన యెడల వెంటనే స్నానమాచరించవలెను.
ధూమపానం, మత్తు పానీయములు, మాంసాహారములు సేవించుట, దీక్షా సమయమందు చేయరాదు.

భవాని దీక్షాధారులు పురుషులు పసుపు రాసుకొనుట, కాటుక, గాజులు, చీరలు కట్టుకొనుట, కాళ్ళకు పట్టాలు, మెట్టెలు ధరించుట అపచారము, స్త్రీలు వలె వేషధారణతో దీక్షను పాటించుట అరిష్టము.

స్త్రీలు మండల దీక్షను తీసికొన వీలుపడని వారు అర్ధమండల దీక్ష (21రోజులు) చేయవచ్చును. శ్రీ భవానీ మండల దీక్షలు : 08 - 11 - 2019 నుండి 22 - 12 - 2019 లోపు దీక్ష తీసుకొని 41 రోజులు ఆచరించవలెను.
అర్థమండల దీక్షలు : 28 - 11 - 2019 నుండి 01 - 12 - 2019 లోపు దీక్ష తీసుకొని 21రోజులు ఆచరించవలెను.

దీక్షా విరమణ
కలశజ్యోతి : మార్గశిర శుద్ధ పౌర్ణమి, బుధవారము 11 - 12 - 2019 సాయంత్రం 6 గంటలకు.
దీక్షా విరమణ : శ్రీ భవానీ దీక్ష పాటించిన వారందరూ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయము నందు 18 - 12 - 2019, బుధవారం నుండి ది . 22 - 12 - 2019 ఆదివారం వరకు గిరిప్రదక్షిణలు , దీక్షా విరమణ, చండీయాగం కార్యక్రమములో పాల్గొని దీక్ష విరమణ చేయవలెను.

మార్గశిర బహుళ సప్తమి, ది . 18 . 12 . 2019 ఉదయం గం. 6.50 లకు అగ్ని ప్రతిష్టాపన, ఇరుముడి, బృహస్పతి శుభహార, అగ్ని కుండములు ప్రారంభమగును.

మార్గశిర బహుళ ఏకాదశి, 22.12.2019 మహాపూర్ణాహుతి శ్రీమల్లిఖార్జున మహామండపం ఎదురుగా హోమగుండాలను ఏర్పాటు చేయడమైనది. శ్రీకనకదుర్గమ్మ వారి భవానీ మండల దీక్షలు, అర్ధమండల దీక్షలు ఆచరించుట భక్తకోటికి ముక్తిదాయకం.దీనిపై మరింత చదవండి :