శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (07:29 IST)

స్వామికి బంగారు గొడుగులు సమర్పించిన క్షురకులు

తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం సందర్భంగా కళ్యాణకట్టకు చెందిన క్షురకులు మంగళవారం సాయంత్రం బంగారు గొడుగును స్వామికి సమర్పించారు. ఇది కొన్నేళ్ళుగా వస్తున్న సంప్రదాయం. 
 
పంతులు కుటుంబానికి చెందిన వారు రాయలు కాలం నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మొదట క్షురకులు అందరూ కలసి కొయ్యతో చేసిన గొడుగును స్వామికి ప్రధానం చేసేవారు. అయితే 1952 నుంచి బంగారు గొడుగును ఇవ్వడం మొదలు పెట్టారు. 
 
అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా రథోత్సవానికి వారు చేయించి ఇచ్చిన బంగారు గొడుగును వినియోగిస్తారు. ఈ గొడుగును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాస రాజుల తదితరులు అందుకున్నారు.