శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (09:06 IST)

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. మాణిక్యాల

కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్రదేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెల్లడించారు. 14 నుంచి ప్రారంభమయ్యే పుష్కారాల కార్యక్రమాలకు 13న కర్టెన్‌రైజర్‌తో కార్యక్రమాల పర్యవేక్షణ మొదలవుతుందన్నారు.  సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గోదావరి పుష్కర ఏర్పాట్లను వివరించారు.

ఇందుకోసం 15వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని, కేంద్రం కూడా తన వంతుగా వందకోట్ల రూపాయలు అందచేసిందని వెల్లడిం చారు. గోదావరి నదివెంట రెవుల నిర్మాణం , పారిశుద్యం, దుస్తుల మార్పిడి వంటి సదుపాయాలకోసమే 550కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు సంబంధించిన అన్నిపనులు 95శాతం పూర్తయ్యాయన్నారు.
 
పుష్కరాల్లో తొక్కిసలాటల వంటి అసౌకర్యాలు కలగకు ండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నామ న్నారు. రాజమండ్రి , నరసాపురం పట్టణాల్లోకి ప్రైవేటు వాహనాలను అనుమతించేదిలేదన్నారు. విఐపిలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వాహనాల్లోరావాల్సిందేనని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా రైస్‌మిల్లర్స్‌ అషోషి యుషన్‌ రాజమండ్రి , కోవూరు కేంద్రాల్లో రోజుకు లక్షమందికి ,నర్సాపురంలో పదివేల మందికి ఆహారం సమకూర్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఆర్యవైశ్య సంఘాలు కూడా ఈ మూడు కేంద్రాల్లో రోజుకు 1.10 లక్షల మందికి ఆహారం సమకూర్చనున్నాయన్నారు. 
 
పోలీసులతోపాటు పెద్ద సంఖ్యలో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నామని, ముందు జాగ్రత్త కింద పాత నేరస్తులందరినీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పిండప్రధానం చేసేవారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 4500మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పారు. 
 
పుష్కర స్నానాల సందర్బంగా ఏవిధమైన ప్రమాదం జరిగినా వెంటనే కాపాడేందుకు 35వందల మంది గజఈత గాళ్లను సిద్దంగా ఉంచుతున్నామన్నారు. అంతేకాకుండా 871బోట్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.