శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: శనివారం, 20 డిశెంబరు 2014 (15:57 IST)

చెప్పులు నెత్తికెత్తుకున్న హీరో అర్జున్..!! ఎప్పుడు..? ఎక్కడ..?

ఆయన ఓ బలాఢ్యుడు ఒంటి చేత్తో ఎందరినైనా విరిచేయగల వీరుడు. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట.. అయినా సరే చెప్పులు నెత్తికెత్తుకుని మూడు చుట్లు తిరిగి నమస్కరించుకుని అక్కడ నుంచి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయింది ఎవరో కాదు, హీరో అర్జున్. ఇదేదో సినిమా కోసం చిత్రీకిరించిన దృశ్యం అనుకుంటున్నారా.. ఎంత మాత్రం కాదు నిజంగా నిజం. ఆయనే కాదు. ఆయన కుమార్తెతో కూడా చెప్పులు నెత్తికెత్తించాడు. 
 
పాముకోళ్లు నెత్తికెత్తుకున్న అర్జున్
ఎప్పుడు?..
ఎక్కడ..? 
ఎందకుకలా జరిగింది..? 
అయ్యోయ్యో.. మీ ప్రశ్నలకు వర్షాన్ని ఇక ఆపేయండి. ఇక సమాధానం చెప్పేస్తున్నాం.. ఆయన నెత్తికెత్తుకున్న చెప్పులు ఎవరివో కాదు తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించినవి. అది ఎక్కడో కాదు. తిరుపతి సమీపంలోని అలిపిరి పాదాల మండపం వద్ద. ఈ నెల 11న తిరుమల రాక సందర్భంగా.. ఇక ఎందుకంటారా..! 
 
ఆయన ఎంత మంచి నటుడో అంత మంచి భక్తుడు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట. ఎంతటి వాడినైనా ఒకే దెబ్బకు మట్టి కరిపించగలడు. కత్తి ఫైటింగ్, కర్రసాము నేర్చిన మనిషి. ఇది ఒక ఎత్తైతే.. భారతీయ కళలు, సంప్రదాయాలంటే ఆయనకు ఎనలేని గౌరవం. తిరుమల దర్శనం కోసం తిరుపతికి వచ్చాడు. మొక్కు తీర్చుకోవడానికి కుమార్తెతో కలసి తిరుమలకు నడిచి వెళ్ళడానికి అలిపిరి వద్దకు చేరుకున్నాడు. 
 
ఇక్కడ భక్తులు వెండి, కంచు, రాగి చెప్పులను భగవంతునికి సమర్పిస్తారు. కొండపైకి వెళ్ళే భక్తులు వాటిని నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తారు. ఇది సంప్రదాయం. అర్జున్ కూడా పాదాల మండపం వద్ద వచ్చి ఆలయంలో అర్చకులు ఇచ్చిన లోహ పాముకోళ్ళు (చెప్పులు) నెత్తిన పెట్టుకుని వినమ్రంగా దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అదే పద్దతిని తన కుమార్తెతో కూడా పాటింపజేశారు. అనంతరం తిరుమలకు కాలిన నడక వెళ్లాడు. అదీ ఆయన దైవ భక్తి.. 
 
(చెప్పు నెత్తి పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తే.. ఏమొస్తుంది? వచ్చే కథనంలో)