శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2015 (08:20 IST)

సారూ... మీరు చెప్పి మూడు రోజుల కూడా కాలేదు.. అప్పుడే లడ్డూల కొరత

లడ్డూలకు ఎటువంటి కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పి మూడు రోజులు కూడా కాలేదు. తిరుమలలో లడ్డూల కొరత ఏర్పడింది. ఆరు లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సాధారణంగా ఇచ్చే లడ్డూలలోనే కోత విధించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో ఆదివారం చాలా మంది భక్తులకు లడ్డూలు లభించలేదు. అదనపు లడ్డూలు లేక వెనుదిరగాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి సిఫారసు లేకుండానే ఆలయం వెలుపల రోజూ 25 వేల అదనపు లడ్డూలు కేటాయించేవారు. వీటిని ప్రత్యేక క్యూలైన్ల ద్వారా విక్రయిస్తారు. అయితే ఆదివారం కేవలం 15 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. 
 
అంతకు మునుపు లక్ష లడ్డూలు ఇచ్చేవారు. దానిని క్రమంగా 50 వేలకు, తర్వాత 25వేలకు తగ్గించేశారు. ఆదివారం ఆ 25లలో కూడా కోత విధించారు. కేవలం 15 వేలు మాత్రమే కేటాయించారు. దీంతో అదనపు లడ్డూలు కావాలనుకున్న వారికి తిప్పలు తప్పలేదు.  లడ్డూలు దొరకకుండానే వెనుదిరిగారు.  బ్రహ్మోత్సవాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు నిల్వ ఉంచడంతో భాగంగా అదనపను లడ్డూలకు కోత విధించినట్లు తెలుస్తోంది.