శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: ఆదివారం, 21 డిశెంబరు 2014 (09:15 IST)

అన్యమత ప్రచారకులుగా టిటిడి ఉద్యోగులు : సమతానంద స్వామి

టీటీడీలోనే ఉద్యోగులలో కొందరు అన్యమత ప్రచారకులుగా ఉన్నారని సమతానంద స్వామి తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ క్షేత్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం హిందూ రక్షా సమన్వయ సమితి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయూన్ని ముట్టడించారు. 
 
ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు కాకినాడకు చెందిన సమతానంద స్వామి మాట్లాడుతూ హిందూ ఆలయంలో జీతాలు తీసుకుంటూ అన్యమత ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. వారిని బదిలీ సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో తొలగించాలని కోరారు. హిందువులు కానివారే టీటీడీలో పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. తిరుపతిని పూర్తిస్థాయి హిందూ క్షేత్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 
టీటీడీ చిన్నస్థాయి ఉద్యోగి కూడా హిందువై ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతులు లేని ప్రార్థనా మందిరాలకు నోటీసులు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయం ముందు భీష్మించుకుని కూర్చున్నారు. దీనికి ముందు వందలాది మంది హిందూ రక్షా సమన్వయ సమితి సభ్యులతో శ్రీనివాసం వద్ద నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయూనికి వచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గౌరయ్య, రామాంజనేయులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.