Widgets Magazine

శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే....

శుక్రవారం, 27 జులై 2018 (12:11 IST)

శ్రావణమాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావమమాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రావణం మంగళవారాల్లో పార్వతీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పూజ మందిరాల్లో పార్వతి, లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు.
 
శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి పండ్లతో పాటు తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను తీసుకుని వెళుతుంటారు. పరమాన్నం పార్వతిదేవికి ఇష్టమైనదిగా శాస్త్రంలో చెప్పబడుతోంది. కాబట్టి బెల్లం, ఆవుపాలు, కొసలు విరగని బియ్యంతో పరమాన్నం తయారుచేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 
 
పరమపవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చును. శ్రావణం మాసపు శుక్రవారాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేసి, పగలు నిద్రపోకుండా, ఆ రోజంతా లక్షీదేవిని ధ్యానిస్తు కనకధారాస్తవం, లక్ష్మీదేవ అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను, సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

గ్రహణ గండాలకు అతీతం : కాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు

సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో చిన్నపాటి ఆలయాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలను ...

news

శనిదేవునికి ఏ పువ్వులతో పూజించాలో తెలుసా?

జీవితం కష్టనష్టాలను మానసికంగాను, శారీరకంగాను వాటిని ఎదుర్కునే విధంగా చేయడంలో శనిదేవుడు ...

news

సంపూర్ణ చంద్రగ్రహణం : శ్రీవారి ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇందులోభాగంగా, ...

news

వీళ్లు మారరు... శ్రీవారి దర్శన సమయంలో అదే గందరగోళం...

శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 దాకా పరిమితి సంఖ్యలో భక్తులను ...

Widgets Magazine