శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 8 జులై 2015 (17:05 IST)

రూ. 300 భక్తులకు టీ, కాఫీ.. ఎయిర్‌పోర్టు తరహాలో డార్మెంటరీలు..టీటీడీ నిర్ణయం

ఆన్‌లైన్‌లో రూ. 300 టికెట్లు బుక్‌ చేసుకునే భక్తులు పెద్ద పీట వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. వారు వేచి ఉండే డార్మెంటరీలు విమానాశ్రయాల తరహాలో వేచి ఉండే గదులలా ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కేటగిరిలో శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టీ, కాఫి, మజ్జిగ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు టిటిడి ఈఓ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. 
 
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రూ. 300 ఆన్‌లైన్‌ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వేచివుండేందుకు 6 కంపార్టుమెంట్లు ఉన్నాయని, వీటి సంఖ్యను పెంచడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రూ. 300 టికెట్‌ భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా పిఏసిలలోని కాలర్లు, డార్మెంటరీలను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ది చేయాలని ఆదేశించారు. 
 
శ్రీవారి లడ్డూల తయారీ కొరకు వినియోగించే సరుకులను మూడు నెలలకు సరిపడే విధంగా నిల్వలు ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. లడ్డూ ప్రసాదాలకు నాణ్యత కలిగిన సరుకులను మాత్రమే దిగుమతి చేసుకోవాలని అధికారులకు సూచించారు. పాతబడిన దాతల కాటేజిలను ఆధునీకరించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రిసెప్షన్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను కోరారు. 
 
రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వెలుపల ఉన్న క్యూ లైన్‌ల అభివృద్ది, అదనపు మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని సంబందిత శాఖకు సూచించారు. అలాగే భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం తెలిసే విధంగా కంపార్టుమెంట్లలలో ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.