శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2015 (11:36 IST)

నేను వచ్చే లోపే యాగం ముగిస్తారా..! రుత్వికులపై టీటీడీ ఛైర్మన్ మండిపాటు

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి రుత్వికులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను వచ్చే లోపే యాగాన్ని ముగించడం.. ఆయనకు ఎక్కడ లేని కోపం తెప్పించింది. నిర్ణీత సమయం కంటే ముందుగా యాగం ఎలా అయిపోయిందని మండిపడ్డారు. అంతమాత్రనా తనను ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు. తిరుమలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల పారువేట మండపం వద్ద మూడు రోజుల నుంచి వరుణయాగం జరుగుతోంది. మూడోరోజు కార్యక్రమానికి రుత్వికులు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని ఆహ్వానించారు. ఉదయం 9.30 గంటలకు రావాలని పండితులు ఆహ్వానించారు. ఆ సమాచారం చైర్మన్‌కు అందలేదు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ యాగం జరుగుతుందని మాత్రం ఆయనకు తెలుసు. దీంతో ఆయన సతీసమేతంగా మధ్యాహ్నం 12.50 గంటలకు సతీసమేతంగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యాగం ముగిసింది.  
 
దీంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహించాల్సిన యాగాన్ని 12 గంటలకే ఎలా ముగిస్తారని మండిపడ్డారు. మధ్యాహ్నం 1 గంట వరకు యాగం ఉంటుందని చెబితేనే తాను  వచ్చానని లేనిపక్షంలో కార్యక్రమానికి వచ్చేవాడిని కానని అక్కడున్న రుత్వికులపై విరుచుకుపడ్డారు. అంతమాత్రానికి తనను ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు.