శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (15:49 IST)

నొసటన బొట్టెందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో పెట్టుకోవాలో తెలుసా?

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే 
అని జగన్మాతను ప్రార్థిస్తూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది.
 
నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్ఠమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావం చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. గాయాలను మాన్పుతుంది.
 
అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే.. మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖ కమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది.