శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (16:57 IST)

తులసి ఆకులను నమిలి మింగితే...?

ప్రతీ ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. చాలామంది తరచు చెప్పే మాట.. తులసి మొక్కను ప్రతిరోజూ పూజించాలని.. ఇది నిజమే.. ప్రతిరోజూ తులసి పూజలు చేస్తే భక్తి విషయం మాత్రమే కాదు.. అనేక వ్యాధులను నయం చేస్తూ.. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధంగా తులసి మొక్కను చెప్పొచ్చు. అందుకు ముఖ్యంగా.. తులసి కోసం ఎక్కడెక్కడో వెతికే బదులు.. ఇంట్లోనే పెంచడం ద్వారా రోజూ వాటి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
 
1. తులసి ఆకులు, వెల్లుల్లిని నూరి.. వాటి రసాన్ని చెవిలో వేసుకుంటే.. చెవినొప్పి తగ్గుతుంది. కఫ వ్యాధులతో బాధపడేవారు.. కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ తాగుతుంటే.. కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
 
2. ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగితే మానసకి ఆందోళనలు, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. 
 
3. స్పూన్ తులసి గింజలను కప్పు నీటిలో వేసి కాసేపు అలానే ఉంచి ఆ తరువాత తాగితే.. మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి. 
 
4. తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని ఈ రెండింటినీ మెత్తగా నూరి.. కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారుచేసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే.. చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి.