బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (15:39 IST)

పచ్చిమిర్చి తీసుకోవడం మంచిదేనా..?

పచ్చిమిర్చిలో క్యాలరీలు శూన్యం. అయినా క్యారీలకు మించిన శక్తి... పచ్చిమిర్చిని తినడం ద్వారా లభిస్తుంది. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిర్చిని తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం శరీరంలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
పచ్చిమిరపకాయలను ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. అలానే పచ్చిమిర్చి మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.

చర్మానికి రక్షణనిస్తుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడుతాయి. పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడా తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇంకా మూడ్ బాగోలేకపోతే పచ్చిమిర్చిని కొరకాల్సిందే. మూడ్ బాగోలేనప్పుడు, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తున్నప్పుడు పచ్చిమిర్చిని వంటకాల్లో చేర్చుకుని తీసుకుంటే.. దానివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి. 
 
పచ్చిమిర్చిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారు పచ్చిమిర్చిని వాడాలి. అలాగే ఇందులోని విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉండడం వలన పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి.