శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (13:39 IST)

నువ్వులు నానబెట్టి ఇలా చేస్తే..?

నువ్వులు వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. వీటిని వంటల్లో వాడితే చాలా రుచిగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. నువ్వులు రెండు రకాలు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. తెల్ల నువ్వులు శరీర వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. మరి నల్ల నువ్వులు తీసుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
నల్ల నువ్వులను నూనెలో బాగా వేయించుకోవాలి. ఆ తరువాత 2 ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర, 1 టమోటా, ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని వేడివేడి అన్నం కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ నువ్వులతో ఇలా చేసిన వంటకాలు సేవిస్తే చలికాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
 
చాలామంది రాత్రివేళ పాలు తాగుతుంటారు. ఆ పాలలో 2 స్పూన్ల నల్ల నువ్వుల పొడి కొద్దిగా తేనె కలిపి సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. కడుపునొప్పితో బాధపడేవారు నువ్వుల పిండిలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు కూడా తొలగిపోతాయి. 
 
నువ్వులను నానబెట్టుకుని శుభ్రం చేసి కప్పు కందిపప్పు కొద్దిగా ఉప్పు, కారం, 2 టమోటాలు వేసి మెత్తగా ఉడికించి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శరీరంలో వేడనే మాటే ఉండదు. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. నువ్వులతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే వ్యాధి అదుపులో ఉండడమే కాకుండా అధిక బరువును కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.