శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (21:23 IST)

కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలు

కర్పూరం. ఆధ్యాత్మికపరంగా దీనికి వున్న ప్రత్యేకత వేరే చెప్పక్కర్లేదు. ఐతే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కర్పూరంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం బాగా పనిచేస్తుంది.
 
నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కర్పూరాన్ని కాటుకలో వాడుతారు. కర్పూరం రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. పురుగుల మందులు, చెడువాసనల నిర్మూలానికి, బట్టలను కొరికి తినే చెదపురుగుల నిర్మూలనకు కర్పూరం ఉపయోగిస్తుంటారు.