శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (09:32 IST)

అసిడిటీతో బాధపడేవారు తినకూడని పదార్థాలు...

చాలా మంది అసిడిటీ (ఆమ్లపిత్త రోగంతో బాధపడుతుంటారు. ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలను ఆరగించకుండా ఉండటం ఉత్తమం. లేనిపక్షంలో అసిడిటీ మరింత ఇబ్బంది కలిగించి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. 
 
* అమ్లపిత్త రోగంతో బాధపడుతుంటే ములేఠీ చూర్ణాన్ని సేవిస్తే రోగం మటుమాయం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
 
* వేపచెట్టు బెరడు చూర్ణం లేదా బెరడును రాత్రిపూట నానబెట్టిని నీటిని ఉదయం వడగట్టి సేవిస్తే అమ్లపిత్త రోగంనుంచి ఉపశమనం కలుగతుంది.  
 
* త్రిఫల చూర్ణం లేదా పాలతో గులకంద్ లేదా పాలలో ఎండుద్రాక్షను ఉడకబెట్టి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 
* మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా, ఆసనాలు మరియు ఔషధ సేవలు చేయండి. 
 
 
అమ్లపిత్త రోగంతో బాధపడుతుంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు: కలకండ, ఉసిరికాయ, గులకంద్, ఎండుద్రాక్షను ఆహారంగా సేవించాలి. తోటకూర, సొరకాయ, కాకరకాయ, కొత్తిమిర, దానిమ్మపండు, అరటిండు మొదలైనవి తీసుకోవాలి. పాలను నియమానుసారం సేవించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 
తినకూడని ఆహార పదార్థాలు: మసాలాలు ఎక్కువగానున్న ఆహార పదార్థాలు, చేపలు, మాంసాహారం, మద్యపానం, ఎక్కువ భోజనం, వేడి-వేడి టీ లేదా కాఫీ, పెరుగు మరియు మజ్జిగ సేవించకూడదు. అలాగే కందిపప్పు మరియు ఉద్దిపప్పును ఎట్టి పరిస్థితుల్లోను ఆహారంగా తీసుకోకూడదు.