Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫుడ్‌ పాయిజనింగ్ అయిందా.. ఇలా చేయండి?

గురువారం, 30 నవంబరు 2017 (11:19 IST)

Widgets Magazine
food poisoning

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. దీంతో కంటికి కనిపించే హోటల్స్, తోపుడు బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఇలా ఎక్కడబడితే అక్కడ, ఏది దొరికితే అది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటున్నాడు. ఇలా ఆరగించడం వల్ల చాలా మంది ఫుడ్‌ పాయిజనింగ్ బారినపడుతుంటారు. దీంతో వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. ఇలాంటివారు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే దీని నుంచి బయటపడొచ్చు. 
 
* కడుపులో వికారంగా అనిపిస్తే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని, నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది. 
* ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను జీలకర్ర వేసి బాగా మరిగించి, ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 
* పొట్టలో వికారంగా అనిపించినప్పుడు మూడు పూటలా ఒక స్పూను తేనె తీసుకుంటే మంచిది.
* ఫుడ్‌ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. దీంతో పొటాషియం పరిమాణం శరీరంలో తగ్గుతుంది. ఫలితంగా నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తినాలి. లేదా రెండు అరటి పళ్లు పేస్టులాచేసి, పాలలో కలిపి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. 
* పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఫుడ్‌ పాయిజనింగ్ అయిన వ్యక్తి ఓ కప్పు పెరుగు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు ...

news

ఆ కారణంగానే భారతీయులకు గుండె జబ్బులు

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు ...

news

ఇలా భోజనం చేస్తే వందేళ్ళు బతకడం గ్యారంటి...

ఈరోజుల్లో చాలామంది కార్యాలయాలకు, కాలేజిలకు, ఇతర అవసరాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేక ...

news

బర్గర్ల కంటే సమోసాలు ఎంతో బెటర్.. ఎందుకో తెలుసా?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు ...

Widgets Magazine