గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 మే 2024 (23:13 IST)

దాల్చిన చెక్క ఎందుకు తినాలో తెలుసా?

cinnamon
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి.
స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి 3 భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగితే మొటిమల సమస్య తగ్గుతుంది.
దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
దాల్చిన చెక్క, శొంఠి, యాలకలు, సైంధవ లవణ చూర్ణాలను సమంగా కలిపి రోజూ ఆహారం తర్వాత అరగ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమంగా కలిపి ఉదయం, సాయంత్రం అరచెంచా పొడిని పావు గ్లాసు పాలల్లో కలిపి తాగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.