గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (13:00 IST)

గంగవల్లి మామిడికాయ పప్పు తయారీ ఎలాగో తెలుసుకోండి!

గంగవల్లి మామిడికాయ పప్పు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
కావలసిన పదార్థాలు :
గంగవాయిలు ఆకుకూర... ఒక కట్ట
కందిపప్పు... ఒక కప్పు
పచ్చి మామిడికాయలు... రెండు
పచ్చిమిరపకాయలు... నాలుగు చీల్చినవి
నెయ్యి... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
జీలకర్ర, ఆవాలు, మెంతులు... పోపుకు సరిపడా
పసుపు... అర టీస్పూను
వెల్లుల్లి రేకలు... ఐదు
 
తయారీ విధానం :
ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి, కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి బాగా వేయించాలి.
 
ఆ తరువాత, అందులోనే నానబెట్టి ఉంచుకున్న పప్పు, రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలను కలిపి, తగినంత నీరు పోసి ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే గంగవాయిలు మామిడికాయ పప్పు రెడీ అయినట్లే...! దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.