శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By PNR
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (16:11 IST)

మష్రూం ఆమ్లెట్ ఎలా వేస్తారు?

కావలసిన పదార్థాలు : 
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - సరిపడ, 
కోడిగుడ్లు - నాలుగు, 
తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, 
తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, 
మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, 
కొత్తిమీర తురుము - కాస్త, 
ఉప్పు - తగినంత, 
నూనె - సరిపడ. 
 
తయారు చేయు విధానం :
బాణాలిలో చెంచా నూనె వేసి కాగాక, అందులో బటన్ మష్రూం (పుట్టగొడుగు) ముక్కలను వేసి దోరగా వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దానిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి. 
 
తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి కాలాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించేస్తే మష్రూం ఆమ్లమెట్ సిద్ధం. దీన్ని వేడిగా సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది.