బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By pnr
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2017 (12:01 IST)

ఇంటర్నెట్ టెక్నాలజీతో ఇంటీరియల్ వాల్‌పేపర్స్ డిజైనింగ్

చెన్నై మహానగరంలో కేఎంవీ ఆటోమేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆటోమేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. గృహ, కార్యాలయ, బోర్డు రూమ్‌లకు ఇంటీరియల్ డెకరేషన్‌కు అవసరమైన హైటెక్ వాల్ జ్యువెలర్స్‌ను అంత

చెన్నై మహానగరంలో కేఎంవీ ఆటోమేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆటోమేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. గృహ, కార్యాలయ, బోర్డు రూమ్‌లకు ఇంటీరియల్ డెకరేషన్‌కు అవసరమైన హైటెక్ వాల్ జ్యువెలర్స్‌ను అంతర్జాల పరిజ్ఞానంతో తయారు చేసింది. దీనికి సంబంధించిన షోరూమ్‌ను స్థానిక అడయారు ఇందిరా నగర్, కామరాజర్ నగర్ రెండో వీధిలో ప్రారంభించింది.
 
శనివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ తమిళ పత్రిక నక్కీరన్ సంపాదకుడు నక్కీరన్ గోపాల్, మహ్మద్ సాథక్ ట్రస్ట్ ఛైర్మన్ ఎస్ఎం యూసుఫ్, ఐఏఎస్ అధికారులు అబ్దుల్ హాసన్, బషీర్ అహ్మద్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని వీటిని ప్రారంభించారు.
 
కాగా, కేఎంవీ ఆటోమేషన్ టెక్నాలజీతో ఇల్లు, ఆఫీసు, బోర్డు రూమ్‌లకు వారివారి అభిరుచులకు తగిన విధంగా సుందరీకరిస్తారు. అంతేకాకుండా, అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమేటిక్ డోర్స్, సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసారు. ముఖ్యంగా, గృహాలు, ఆఫీసులు, బోర్డు కార్యాలయాలను తమ అభిరుచికి తగిన విధంగా సుందరీకరించుకోవచ్చు. ఈ సుందరీకరణ పనులకు విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఇంటర్నెట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను వినియోగించి పూర్తి చేస్తారు.
 
అలాగే, ఫిజికల్ డివైజెస్, వెహికల్స్, హోమ్ అప్లైయన్సెస్, ఇతర వస్తువులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తారు. 18 యేళ్ళ అనుభవం కలిగిన కేఎంవీలో ఎంతో అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారు. వీరికి ఐబీఎంఎస్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్ రంగాల్లో ఇప్పటికే తమ నైపుణ్యాన్ని, సమర్థతను నిరూపించుకున్నారు. ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించి ఇంటీరియల్ డెకరెషన్స్‌ను ఎంతో సుందరంగా, చూడగానే ఇట్టే ఆకర్షించేలా అంటిస్తున్నారు. అలాగే, ఆటోమేటిక్ డోర్ షట్టర్స్ టెక్నాలజీని కూడా కేఎంవీ ఆటోమేషన్ పరిచయం చేసింది.