సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (13:21 IST)

చైనా బొగ్గు గనిలో ప్రమాదం - 14 మంది మృత్యువాత

చైనా దేశంలో ఓ బొగ్గుగని కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నైరుతి చైనాలోని గుయిజూ ప్రావీన్స్‌లో జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. 
 
ఇక్కడ ఉన్న బొగ్గు గనుల్లో సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో 25వ తేదీన పైకప్పు కూలిపోయింది. అక్కడ పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకునిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి. 
 
అప్పటి నుంచి ఇప్పటివరకు సహయాక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఈ  బొగ్గు గని నుంచి 14 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమంది ప్రాణాలతో రక్షించారు. 
 
గని ప్రవేశద్వారం నుంచి 3 కిలోమీటర్ల మేరకు పైకప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దతి కావడంత గనిలో చిక్కుకునివున్నవారిని రక్షించడంలో కష్టతరంగా మారింది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది.