గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:40 IST)

మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం... 25 మంది సజీవదహనం!

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం వేకువజామున జరిగిన ఈ విషాద ఘటనలో విద్యార్థులు, వార్డెన్లు సహా 25 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం వేకువజామున జరిగిన ఈ విషాద ఘటనలో విద్యార్థులు, వార్డెన్లు సహా 25 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న ఓ రెండస్థుల మత పాఠశాల హాస్టల్‌లో ఈ ప్రమాదం సంభవించింది.
 
గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపువారు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్టు మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాల సమాచారం. 
 
ఈ ఘటనపై ప్రధాని నజీబ్‌ రజాక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గత రెండు దశాబ్దాలలో మలేషియాలోని పాఠశాల్లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదేనని చెప్పారు. బెడ్‌రూమ్‌లో ఏర్పడ్డ మంటలు కొంత సమయానికే భవనం మొత్తం వ్యాపించడంతో ఎక్కువ మరణాలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఖిరుదిన్ ద్రాహ్మాన్ చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు.