శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2017 (13:29 IST)

తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి... సీఎం చంద్రబాబు సీరియస్...

కర్నాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేశాయి. హోటళ్లలో బస చేసిన తెలుగు అభ్యర్థుల లగేజిని బయటకు తీసుకువచ్చి రోడ్డుపై దగ్ధం చేశారు. కర్నాటక రీజనల్ రూరల్ బ్యాంకుల ఉద్యోగా

కర్నాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేశాయి. హోటళ్లలో బస చేసిన తెలుగు అభ్యర్థుల లగేజిని బయటకు తీసుకువచ్చి రోడ్డుపై దగ్ధం చేశారు. కర్నాటక రీజనల్ రూరల్ బ్యాంకుల ఉద్యోగాలకు తెలుగు విద్యార్థులు హాజరై తమ ఉద్యోగాలను తన్నుకెళుతున్నారంటూ కన్నడిగులు ఆరోపిస్తున్నారు. 
 
మా ప్రాంతంలోని ఉద్యోగాలు మాకే దక్కాలనీ, మీరు ఇక్కడ పరీక్ష రాసేందుకు ససేమిరా అంగీకరించబోమంటూ వారిని అడ్డుకున్నారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది తెలుగు విద్యార్థులను రైళ్ల నుంచి దిగకుండా దిగ్బంధించారు. రాయలసీమ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులందరినీ వారు అడ్డుకుని పరీక్షలు రాయకుండా చేశారు. 
 
ఈ విషయంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో జరిగే పోటీ పరీక్షలకు ఏ ప్రాంతం వారైనా ఎక్కడికైనా వెళ్లి రాయవచ్చనీ, దీన్ని అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో దీనిపై మాట్లాడుతాననీ, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతానని చెప్పారు.