మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (12:52 IST)

శ్రీలంకలో ఆరుగురు భారతీయుల​ అరెస్ట్​.. కోటి రూపాయల బంగారాన్ని?

1.7 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

బంగారం స్మల్లింగ్‌‌‌‌ చేస్తున్న ఆరుగురు ఇండియన్స్‌‌‌‌ను శ్రీలంక క్రిమినల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (సీఐడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బండారునాయకే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఆదివారం తనిఖీలు చేపట్టిన అధికారులు వారిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 2.376 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
దాని విలువ దాదాపు 1.7 కోట్ల రూపాయలు ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పారు. నిందితులు టూరిస్ట్‌‌‌‌ వీసాపై దేశానికి వచ్చి స్మగ్లింగ్‌‌‌‌ చేస్తున్నారన్నారు. తదుపరి విచారణ కోసం వారిని కస్టమ్స్‌‌‌‌ అధికారులకు అప్పగించారు.