శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (18:05 IST)

ఆఫ్ఘన్ మసీదులో ఉగ్రదాడి... 18 మంది మృత్యువాత

terrorist
ఆప్ఘనిస్తాన్ దేశంలో బాంబుల మోతతో దద్ధరిల్లిపోయింది. తాలిబన్ల పాలనలో ఉన్న ఈ దేశంలో శుక్రవారం ఓ మసీదులో ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో 18 మంది మృత్యువాతపడ్డారు. తాలిబన్ల మద్దతు మతగురువు లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగింది.
 
శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. వెస్ట్ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలో గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఇందులో పేలుడు జరిగిన ప్రాంతంలోనే 18 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.