గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (12:43 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రెంచి ఎథికల్‌ హ్యాకర్‌ సవాల్‌...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రెంచి ఎథికల్ హ్యాకర్ సవాల్ విసిరారు. మోడీకి ఆధార్‌ సంఖ్య ఉంటే దానిని ఆన్‌లైన్‌లో వెల్లడించాలని స్వయం ప్రకటిత ఫ్రెంచి భద్రతా నిపుణుడు, ఎథికల్‌ హ్యాకర్‌ ఇలియట్‌ ఆండర్సన్‌ స

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రెంచి ఎథికల్ హ్యాకర్ సవాల్ విసిరారు. మోడీకి ఆధార్‌ సంఖ్య ఉంటే దానిని ఆన్‌లైన్‌లో వెల్లడించాలని స్వయం ప్రకటిత ఫ్రెంచి భద్రతా నిపుణుడు, ఎథికల్‌ హ్యాకర్‌ ఇలియట్‌ ఆండర్సన్‌ సవాల్‌ విసిరారు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ట్విటర్లో వెల్లడించిన ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఆండర్సన్‌ బయటపెట్టారు.
 
మొబైల్ సంఖ్య, పాన్‌, ప్రత్యామ్నాయ ఫోన్‌, ఇ-మెయిల్‌ చిరునామా, కుటుంబంతో దిగిన చిత్రం వంటి సమాచారాన్ని శనివారం ఆయన లీక్ చేశారు. మరికొందరు ఎథికల్‌ హ్యాకర్లూ ఆయనకు తోడుగా శర్మ గురించి ఇంకొంత సమాచారం వెల్లడించారు. ఆయన ఐ-ఫోన్‌ వాడుతున్నారనీ, బ్యాంకు ఖాతాతో ఆధార్‌ సంఖ్యను అనుసంధానించుకోలేదనీ వారు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రధానికి కూడా ఆండర్సన్‌ సవాల్‌ విసిరారు. 
 
ఆధార్‌ వ్యవస్థ లోపభూయిష్టమైనదంటూ గత కొన్ని నెలలుగా ఆండర్సన్ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సవాల్ విసిరారు. ఆయన ఆధార్ నంబరును వెల్లడిస్తే ఆయన వివరాలన్నింటినీ బహిర్గతం చేస్తానంటూ ప్రకటించారు.