గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (18:04 IST)

అంటార్కిటికాలో ఏలియన్స్ సంచారం.. గూగుల్ మ్యాప్ కనిపెట్టేసిందట..

ప్రపంచంలోని దేశాల్లో అప్పుడప్పుడు ఏలియన్లకు సంబంధించిన వార్తలు వస్తూనే వున్నాయి. కొందరు ఏలియన్స్‌ను చూసినట్లు చెప్తున్నారు. ఇలా ఏలియన్స్‌కు సంబంధించిన డేటాతో హాలీవుడ్ దర్శకులు కొన్ని హిట్ సినిమాలు కూడా తీశారు. ఈ నేపథ్యంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో పాటు పలు దేశాలు పలు కోట్ల రూపాయలు వెచ్చించి ఏలియన్స్‌పై పరిశోధన జరుపుతున్నాయి. 
 
ప్రస్తుతం ఏలియన్లు రహస్యంగా అంటార్కిటికాలో మిలిటరీ గార్డును నిర్వహించినట్లు సమాచారం వైరల్ అవుతోంది. ఈ విషయం గూగుల్ మ్యాప్ సహాయంతో కనుగొనడం జరిగింది. అంటార్కిటికాలోని ఓ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన వస్తువులు వున్నట్లు తెలుస్తోంది. 
 
సరిగ్గా రెండు శతాబ్ధాలకు ముందు (1819)వ సంవత్సరం అంటార్కిటికా కెప్టెన్ జోన్స్ కుక్‌ దీన్ని కనుగొన్నట్లు చరిత్ర వుంది. ఇక్కడ రాత్రిపూట విచిత్రమైన రూపాలు సంచరిస్తున్నట్లు, ఇంకా ఏలియన్స్ మిలిటరీ గార్డ్ లాంటి కొన్ని వస్తువులు కూడా ఇక్కడ వున్నట్లు గూగుల్ మ్యాప్ ద్వారా కనుగొనడం జరిగింది.