శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (08:48 IST)

'అణు'మానం లేకుండా నాలుగు తీర్మానాలపై ట్రంప్ - కిమ్ సంతకాలు

సింగపూర్ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచానికి ఉపశమనాన్నిస్తూ అమెరికా, ఉత్తరకొరియా మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర చర్చలు ఫలప్రదమయ్యాయి.

సింగపూర్ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచానికి ఉపశమనాన్నిస్తూ అమెరికా, ఉత్తరకొరియా మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర చర్చలు ఫలప్రదమయ్యాయి. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు అంగీకరించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి భద్రతతోపాటు పలు ప్రయోజనాలపై హామీలను పొందగలిగారు. అలాగే, దక్షిణ కొరియా సముద్ర జలాల్లో అమెరికా చేపట్టిన సైనిక విన్యాసాలను కూడా రద్దు చేసేందుకు అమెరికా సమ్మతించింది. దీంతో ఇకపై కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు చోటువుండదు.
 
ఇదిలావుంటే, ఇరు దేశాధినేతల మధ్య నాలుగు కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద పత్రాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేశారు. ఆ తీర్మానాలను పరిశీలిస్తే, 
 
* ఉత్తరకొరియాలోని అణు పరీక్ష కేంద్రాలను పూర్తిగా నిర్మాలన చేయటం. 2018 ఏప్రిల్ 27వ తేదీనాటి పాన్ ముంగ్ జోమ్ తీర్మానానికి అనుగుణంగా అణ్వస్త్రరహిత దేశంగా గుర్తింపు తెచ్చుకోవాలి. భవిష్యత్‌లోనూ అణ్వాయుధాలు తయారీ చేపట్టకూడదు. వాటికి సంబంధించిన అన్ని ప్రయోగశాలలు, టెక్నాలజీని ధ్వంసం చేయాలి.
 
* యుద్ధ ఖైదీల పేరుతో ఉత్తరకొరియాలో జైళ్లలో ఉన్న వివిధ దేశాల వారిని వెంటనే విడిచి పెట్టాలి.
* నార్త్ కొరియాలో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటం, అభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం ఉంటుంది. రెండు దేశాలు కలిసి కొత్త విధానాలు రూపొందించి ముందుకు సాగటం
* ఇక నాలుగోది.. ఉత్తరకొరియాలో శాశ్వత శాంతి స్థాపన. అమెరికా భాగస్వామ్యంతో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగటం.