శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (11:53 IST)

ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. మనమెందుకు కారాదు...

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఒక్కటయ్యాయని గుర్తుచేశారు. అలాంటపుడు దాయాది దేశాలైన భారత్ - ప

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఒక్కటయ్యాయని గుర్తుచేశారు. అలాంటపుడు దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్‌లు ఒక్కటి ఎందుకు కారాదంటూ ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఉత్తర, దక్షిణ కొరియాలు ఏడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. మరి భారత్, పాకిస్థాన్ కూడా ఎందుకు ఒక్కటవ్వకూడదు అని ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య ఉన్న వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉదని నొక్కి చెప్పారు. 
 
తరచుగా సరిహద్దులో కాల్పుల మోత మోగుతూనే ఉందని, ఇంకా ఎన్నాళ్లు ఈ మోతను భరించాలన్నారు. ఇరు దేశాలు స్నేహితులుగా మారి ఒక్కటయ్యే వరకు సమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లో శాంతినెలకొనే విషయంలో వేర్పాటువాదులు కూడా ఆలోచించాలని, చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.