చైనాలో కిమ్ జాంగ్ పర్యటన: 2011లో తండ్రి జర్నీ చేసిన అదే తరహా రైలులోనే?

మంగళవారం, 27 మార్చి 2018 (09:11 IST)

kim jong un

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ తొలిసారి దేశం వీడుతున్నారు. తొలిసారి విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంగ్.. 2011లో అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా విదేశీ పర్యటనకు పర్యటించే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పటి వరకు దేశం దాటి బయటకు అడుగుపెట్టలేదు. 
 
చైనాలో కిమ్ జాంగ్ పర్యటన వుంటుందని సమాచారం. అయితే చైనాలో కిమ్ జాంగ్ ఎన్నిరోజులు పర్యటిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. చైనాలో కిమ్ జాంగ్ ఎవరిని కలవబోతున్నారనేది ఇంకా తెలియరాలేదు. కిమ్ జాంగ్ ఓ ప్రత్యేక రైలు ద్వారా ఉత్తర సరిహద్దు పట్టణమైన డాన్‌డోంగ్ మీదుగా చైనాలోకి అడుగుపెడతారని తెలుస్తోంది. 
 
ఇంకా కిమ్ జాంగ్ తండ్రి ఉపయోగించిన రైలు వంటిదే సోమవారం ఓ రైలు బీజింగ్‌కు చేరుకుంది. 2011లో తన మరణానికి ముందు కిమ్ జాంగ్ 11 ఇలాంటి రైలులోనే చైనాను సందర్శించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్‌ను కలిసేందుకు అంగీకరించిన కొన్నివారాల్లోనే కిమ్ చైనాలో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :  
అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా చైనా ప్రత్యేక రైలు America Train Beijing Special Train North Korea Donald Trump Kim Jong Un

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆయన 'ఆల్‌ ది బెస్ట్' చెప్పారట.. అయితే, జనసేనలోకి వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అమలులో మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

news

బీజేపీని చిత్తుగా ఓడించనున్న తెలుగు ప్రజలు.. హస్తానికి జై... ఎక్కడ?

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన మోసానికి ప్రతీకారం ...

news

అవిశ్వాసంపై చర్చ ఖాయమా? టీఆర్ఎస్ ఏమంది? ఎంపీలు రాజీనామా చేస్తారా?

అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ జరిగేలా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ ...

news

ఏపీ 'హోదా' ఎఫెక్ట్ కర్నాటకలో రిఫ్లెక్ట్ కాబోతుందా? భాజపాపై తెలుగువారు...?

కర్నాటక రాష్ట్రంలోని 30 జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో తెలుగువారి ప్రభావం విపరీతం అని ...