శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (12:16 IST)

లగ్జరీ రైళ్ల ఛార్జీలు సగానికి సగం తగ్గిపోనున్నాయట..

లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్య తరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయ

లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్య తరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయి. 
 
అయితే ఇప్పటివరకు భారత రైల్వేలు త్వరలోనే వాటిని సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా వాటిని ప్రయాణ ఛార్జీలను సగానికి సగం తగ్గించేందుకు నిర్ణయించింది రైల్వే శాఖ. ఈ నెల 1న జరిగిన రైల్వే బోర్డు సమీక్షా సమావేశంలో ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నోటికేషన్ కూడా విడుదలైంది. 
 
ది పయనీర్ నివేదిక ప్రకారం తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి వుంటుంది. ఈ లగ్జరీ రైళ్లపై ప్రయాణీకుల ఆసక్తి గణనీయమైన తగ్గిపోవడంతోనే రైల్వే శాఖ ఛార్జీలను తగ్గించేలా నిర్ణయం తీసుకుంది.