Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యాంకులను దోచుకుని పారిపోయే వాళ్ల కోసం కొత్త చట్టం : కేబినెట్

గురువారం, 1 మార్చి 2018 (19:42 IST)

Widgets Magazine
arun jaitley

బ్యాంకుల్లో భారీ మొత్తంలో రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయేవాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకుని రానుంది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ, ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు, 2017ను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయేవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందన్నారు. 
 
మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈ కేసులపై విచారణ జరుగుతుందన్నారు. విదేశాలకు పారిపోయినవారి అన్ని ఆస్తులను, బినామీ ఆస్తులతో సహా, జప్తు చేయడానికి ఈ బిల్లు ప్రతిపాదించిందన్నారు. కంపెనీల చట్టాన్ని కూడా సవరిస్తామని తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టం అయిన తర్వాత విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారి ఆస్తులను జప్తు చేసి, అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది. 
 
కాగా, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ వంటివారు దేశంలోని బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని దేశం వీడిపారిపోతున్న విషయం తెల్సిందే. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి, విదేశాలకు పారిపోయేవారిని నేరస్థులుగా ప్రకటించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్.. ఒక యేడాది పాటు ఉచితం

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ బిగ్ టీవీ ఓ బంపర్ ఆఫర్‌ను ...

news

వచ్చే ఏడాది ఎన్నికలు.. రైల్వేలో 89,500ల నియామకాలు

రైల్వేలో ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు రానుండటంతో ...

news

మరో బ్యాంకు స్కామ్ : పంజాబ్ సీఎం అల్లుడుపై సీబీఐ కేసు

మరో బ్యాంకు స్కామ్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు ...

news

నిన్న పంజాబ్ నేషనల్.. నేడు ఓరియంటల్... బ్యాంకును ముంచిన మరో వజ్రాల వ్యాపారి

దేశంలో వజ్రాల వ్యాపారుల బండారం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. నిన్నటికినిన్న సూరత్‌కు ...

Widgets Magazine