మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (18:13 IST)

శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసింది.. బాత్‌ టబ్‌లు వుండవుగా...

సినీనటి శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసిందని దుబాయ్ మీడియా విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్త సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే.. భారతీయ మీడియ

సినీనటి శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసిందని దుబాయ్ మీడియా విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్త సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే.. భారతీయ మీడియా మాత్రం సమాచారాన్ని వక్రీకరిస్తూ చూపించిందని తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారని ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ భారత మీడియా ఎన్నో అవాస్తవాలను ప్రచురించిందిన దుబాయ్ మీడియా ఆరోపించింది. 
 
శ్రీదేవిపై భారత మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని.. భారత్‌లోని చాలామంది ఇళ్లల్లో బాత్ టబ్‌లు వుండవని దుబాయ్ మీడియా ఎద్దేవా చేసింది. వాటి వాడకం గురించి వారికి తెలియదని సెటైర్లు విసిరింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి టబ్‌లో దిగి అక్కడి నుంచి రిపోర్టర్లు అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తూ ఓవరాక్షన్ చేశారని విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతిపై సుబ్రమణ్య స్వామి, అమర్‌ సింగ్‌లు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ దుబాయ్ మీడియా ఓవరాక్షన్ చేసింది.