శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:00 IST)

శ్రీదేవి కథ కంచికి : దేవతలా వెళ్ళి మృతదేహంలా వచ్చిన జాబిలమ్మ

ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు మంగళవారం తెరపడింది. ఫలితంగా ఈ మృతి కేసు కథ కంచికి చేరింది. ఆమె మృతదేహాన్ని దుబాయ్‌ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఆమె కుట

ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు మంగళవారం తెరపడింది. ఫలితంగా ఈ మృతి కేసు కథ కంచికి చేరింది. ఆమె మృతదేహాన్ని దుబాయ్‌ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీదేవి అనుమానాస్పద మృతిపై వెల్లువెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకలేదుగానీ.. కేసు క్లోజ్‌ అయినట్టు దుబాయ్‌ ప్రభుత్వ మీడియా కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. 
 
అయితే, ఈ కేసుకు సంబంధించిన పలు అనుమానాలకు మాత్రం ఇంకా సమాధానాలు లేవు. దుబాయ్‌ పోలీసులు చెబుతున్నదాని ప్రకారం వారికి బోనీ నుంచి కాల్‌ వచ్చింది రాత్రి 9 గంటలకు. తాము అక్కడికి చేరుకునే సమయానికి ఆమె చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె మరణించిన సమయాన్ని అటాప్సీ నివేదికలో 10.01 గంటలుగా పేర్కొన్నారు. కేసు వివరాలన్నింటినీ దుబాయ్‌ అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేసి ఉంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. 
 
మరోవైపు, శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముంబైలోని విలేపార్లే సేవాసమాజ్‌ హిందూ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదలైంది. శ్రీదేవికి కడసారి నివాళులు అర్పించాలనుకునే అభిమానుల సందర్శనార్థం.. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల దాకా ఆమె భౌతికకాయాన్ని అంథేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌‌లో ఉంచుతారు. 
 
ఆ తర్వాత 12.30 గంటల నుంచి 1..30 గంటల వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంతిమయాత్ర ప్రారంభించి.. 3.30 గంటల సమయంలో దహనక్రియలు నిర్వహిస్తారు. ఈ దహన సంస్కారాలకు మీడియా వ్యక్తులు కెమెరాలను, ఇతర రికార్డింగ్‌ పరికరాలను బయటే వదిలి రావాలని స్పష్టంచేశారు.