శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 1 మార్చి 2018 (19:33 IST)

ఎండల్లో ఎసిడిటీ రాకుండా వుండాలంటే...?

ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని నివారించటానికి ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం. 1. పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పం

ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని నివారించటానికి ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
1. పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం నీటి కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచు పదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడుతాయి.
 
2. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతి సిద్ధమైన డ్రింక్. ఇందులో క్లీనింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కొబ్బరి నీళ్లలో కూడా పీచుపదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
 
3. చల్లటి పాలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య పోతుంది. స్టొమక్ లోని యాసిడ్‌ని పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. కడుపులో ఎసిడిటీతో బాధపడుతున్నా, ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తినా పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి.
 
4. అరటిపండు ఎసిడిటీ మీద బాగా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం స్టొమక్ అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపళ్లలో పీచు పదార్థాలు కూడా బాగా ఉన్నాయి. అందుకే వేసవిలో మిగలపండిన అరటిపండును తింటే ఎసిడిటీ సమస్య తలెత్తదు.