ఎసిడిటీ యమ డేంజర్ గురూ... గ్యాస్‌తో జ్ఞాపకశక్తి నాస్తి...

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (21:56 IST)

acidity

పొట్టలో మంటగా ఉంటే అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మెదడు కూడా దెబ్బ తింటుంది. ఎందుకుంటే వేళకి సరిగ్గా తినకపోవడం లేదా చాలా తక్కువ తినడం వల్లే పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గ్యాస్ మంట వస్తాయి. దీనివల్ల మెదడుకి అందాల్సిన ఆహారం అందకపోవడంతో పాటు గ్యాస్ కారణంగా జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడీ కణాల పనితీరు పూర్తిగా దెబ్బ తింటుందని జార్జియా మెడికల్ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఆహారం లేకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడితే  మెదడుకే ప్రమాదం. అంటే మెదడుకే మోసం వస్తుందన్న విషయాన్నిగుర్తించి ముందుగానే జాగ్రత్తపడటం ఎంతైనా మంచిది.
 
తీసుకోవలసిన  జాగ్రత్తలు
1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్‌లో ఉంటుంది.
 
2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది.
 
3. ఉదయాన్నే అరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది.
 
4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
 
5. గోరు వెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.దీనిపై మరింత చదవండి :  
Acidity Home Remedies Gastric Issue

Loading comments ...

ఆరోగ్యం

news

శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు... ఇదే చిట్కా

జీవిత భాగస్వామిని శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు పడుతుంటారు. ఎంత ...

news

స్పూన్‌తో ఆహారం తింటున్నారా? ఐతే ఇది చదవాల్సిందే...

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు ...

news

ద్రాక్షపండ్ల సమ్మేళనాలతో ఆ వ్యాధులు దూరం..

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ...

news

అధిక బరువును తగ్గించే బార్లీ, బఠాణీలు..

అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. ...

Widgets Magazine