గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (12:27 IST)

చపాతీలు తింటే క్యాన్సర్ మటాష్

రోజూ రెండు చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ కణాలను నశింపజేసే గుణాలు గోధుమల్లో పుష్కలంగా వున్నాయి. కానీ నూనె అధికంగా చేర్చుకోకుండా.. చపాతీల్లో తక్కువ నూనెను

రోజూ రెండు చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ కణాలను నశింపజేసే గుణాలు గోధుమల్లో పుష్కలంగా వున్నాయి. కానీ నూనె అధికంగా చేర్చుకోకుండా.. చపాతీల్లో తక్కువ నూనెను వాడి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. మ‌ధుమేహం ఉన్న వారికి చ‌పాతీలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు. 
 
చాలా నెమ్మ‌దిగా గ్లూకోజ్ ర‌క్తంలో క‌లుస్తుంది. దీంతో షుగ‌ర్ అదుపులో ఉంటుంది. గోధుమల్లో వుండే ఫైబర్ ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలుండవు. గోధుమ‌ల్లో ఉండే ఐర‌న్ ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. చపాతీలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. చపాతీల్లో వుండే జింక్ చర్మానికి నిగారింపులు ఇస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.