శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 12 డిశెంబరు 2017 (21:43 IST)

ఎసిడిటి పోవాలంటే ఏం చేయాలి?

ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇదివరకు భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది. కానీ బెల్ల

ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇదివరకు భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది. కానీ బెల్లం వల్ల గ్యాస్ ఎంతగానో తగ్గుతుంది. బెల్లం లోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని మంచినీళ్ళు తాగండి. మళ్ళీఉదయాన్నే నిద్రలేస్తునే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. ఉపశమనం లభిస్తుంది. 
 
ఒక్కోసారి ఉదరంలో పుట్టుకొచ్చే ఎసిడిటీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏమి చేసినా ఒక పట్టాన తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో బాగా మాగిన అరటిపండు తినండి. అందులోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో ఇబ్బందులు తొలుగుతాయి. అంతేకాదు కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూన్ తేనె కలుపు కొని తాగండి.
 
పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం అలాంటివేమి కలుపుకోకూడదు. ఒక కప్పు నీటిని మరగనివ్వండి. అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి కాసేపు ఆ పాత్రకు మూతపెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటికి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగండి. అలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటికి పరిష్కారం లభించినట్లే.
 
పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. తరువాత వాటిని చల్లార్చి సేవించండి. రోజూ అలా చేస్తే వారం, పదిరోజులలో గ్యాస్ కొంతవరకైన తగ్గుతుంది. ఈ రసం వలన దగ్గు, జలుబు కూడా నివారించవచ్చు. మనం రోజూ తీసుకునే మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ కడుపులోని గ్యాస్‌కు కళ్లెం వేస్తుంది. 
 
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాల దినుసులతో భోజనం చేసినపుడు మజ్జిగ తీసుకోవడం మరవవద్దు. కడుపుబ్బరం తక్షణ సమస్యకు చక్కటి పరిష్కారం రోజు తాజా కొబ్బరి బోండం తాగడం గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి వస్తుంది.