Widgets Magazine

పుల్లటి పెరుగుతో చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని ఇలా వాడాలి అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫల

wet hair
selvi| Last Updated: మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:36 IST)
చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని ఇలా వాడాలి అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది.

అంతేగాకుండా రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్‌ మసాజ్‌ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేసినా చుండ్రు మాయమవుతుంది. అలాగే కొద్దిగా పెరుగును తీసుకుని దాన్ని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ పెరుగు పులుస్తుంది. దీన్ని జుట్టుకు బాగా పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. అనంతరం కడిగేయాలి. పెరుగులో ఉండే యాసిడ్ గుణాలు చుండ్రుపై పోరాడతాయి. దీంతో ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

జుట్టుకు మంచి పోషణను అందించే కండిషనర్‌గా గోరింటాకు వాడొచ్చు. కొద్దిగా గోరింటాకు పొడి, టీ లిక్కర్, పెరుగులను ఒక చిన్న పాత్రలో తీసుకుని ఆ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దాన్ని 8 నుంచి 10 గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టుకు పట్టించి, 1 గంట సేపు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :