బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (13:47 IST)

కాఫీ టీకి బదులు గోరువెచ్చని నీటిలో...

కాఫీ, టీలు ఉదయం పూట తాగనిదే కొందరు ఏ పనిచేయరు. దీనివల్ల ఆ సమయంలో మాత్రమే ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ తాత్కాలికమే. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒకస్పూన్ తేనే కలిపి పరగడుపు

కాఫీ, టీలు ఉదయం పూట తాగనిదే కొందరు ఏ పనిచేయరు. దీనివల్ల ఆ సమయంలో మాత్రమే ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ తాత్కాలికమే. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒకస్పూన్ తేనే కలిపి పరగడుపున తీసుకోవడం వలన శరీరంలో కొవ్వుకరగడమే కాకుండా రోగనిరోధక శక్తిపెరిగి శరీరం చరుగ్గా మారుతుంది.
 
అలాగే ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాదు ఉదయాన్నే ఒక అరగంట నడవటం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు.

రక్తప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు.  ఇంకా బరువు తగ్గాలంటే.. పోషకాహారంతో పాటు తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. నానబెట్టిన మొలకలు తీసుకోవచ్చు. గోధుమలు, కోడిగుడ్లు, పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.